నేరస్తులకు కులాలు అంటగడతారా...
రాజకీయంగా నాయకులు అండగా నిలుస్తారా అలాంటి నేతలను దూరం పెట్టాలి నేరస్తులను ప్రొత్సహిస్తే ప్రమాదంలోకి సమాజం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు కాకినాడలో మన ఊరు - మాట మంతి నిర్వహణ (కాకినాడ - జయజయహే) : కాకినాడలో నిర్వహించిన ‘మన ఊరు.. మాట మంతి’ కార్యక్రమంలో జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పాల్గొన్నడిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేరస్థులకు కులాలు అంటగట్టడం సరికాదని, వారికి రాజకీయంగా అండగా నిలిచే నాయకులను ప్రజలు దూరం పెట్టాలని పిలుపునిచ్చారు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే వ్యక్తులను ఎన్నుకోబోమని ప్రజలు గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. నేరస్థులను ప్రోత్సహిస్తే సమాజ భవిష్యత్తే ప్రమాదంలో...