వాకర్స్ సమస్యల పరిష్కరించాలని ఎమ్మెల్యే కు వినతి పత్రం
వాకర్స్ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కు వినతిపత్రం
అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే విజయ రమణారావు ఆహ్వానం
సుల్తానాబాద్ : సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను విజయవంతం చేయడానికి సుల్తానాబాద్ వాకర్ అసోసియేషన్ సభ్యులు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సుల్తానాబాద్ వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ విజయ రమణారావు ను మర్యాద పూర్వకంగా కలిసి, ఆదివారం జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, వాకర్స్ సభ్యులు ప్రతిరోజూ వినియోగిస్తున్న గ్రౌండ్‌లో ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా గ్రౌండ్‌లో ఉన్న జిమ్ పరికరాలు శిథిలావస్థకు చేరుకోవడంతో వాకర్స్, యువత వ్యాయామం చేసే వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. జిమ్‌ను మరమ్మతులు చేయించి ఆధునిక సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకురావడం ద్వారా వందలాది మంది ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.అలాగే వాకర్స్‌కు అవసరమైన మౌలిక వసతుల కల్పన, గ్రౌండ్ పరిశుభ్రత, తాగునీటి సదుపాయం, లైటింగ్ ఏర్పాట్లు తదితర అంశాలపై కూడా ఎమ్మెల్యే కు వినతిపత్రం సమర్పించారు. సభ్యుల సమస్యలను ఎమ్మెల్యే విజయ రమణారావు శ్రద్ధగా విని, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకునేందుకు సానుకూలంగా స్పందించినట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. అనంతరం నూతనంగా ఎన్నికైన వాకర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులకు ఎమ్మెల్యే సన్మానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో వాకర్ అసోసియేషన్ అధ్యక్షులు చొప్పరి సుమన్, ప్రధాన కార్యదర్శి నిట్టూరి శ్రీనివాస్, కోశాధికారి కామణి శ్రీకాంత్, గౌరవ అధ్యక్షులు, అమిరి శెట్టి రాజలింగం, వైస్ ప్రెసిడెంట్ పల్ల సురేష్, ముఖ్య సలహాదారులు, రాజేంద్రప్రసాద్ ప్రచార కార్యదర్శి సుంక వేణు, సహాయ కార్యదర్శి కొలిపాక రవీందర్, కామణి వెంకటేశం, లీగల్ అడ్వైజర్ కోడెం అజయ్, గుడ్ల వెంకటేష్, కార్యవర్గ సభ్యులు, బూడిద స్వామి, మద్దెల కొమురయ్య, రామకృష్ణ, దర్శనాల రామచంద్రం, ఉల్లంగుల శ్రీనివాస్, కొయ్యడ సంతోష్, జాన్వి శ్రీనివాస్,యోగా కోచ్, దేవరకొండ ప్రకాష్, సీనియర్ క్రీడాకారుడు ఎండి ముస్తఫా వాకర్ సభ్యులు, ఎలగందుల మల్లేశం, పోడేటి వెంకటేష్, రమణ, కట్ల రాజమౌళి, ఎండి ఖాసిం, కొమురవెల్లి ప్రభాకర్,వాకర్ సభ్యులు సీనియర్ క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..